శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

82

శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
జయరాం హత్య కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ..
కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం హత్యకేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఇప్పటి వరకూ ఈ కేసు దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు హత్యలో శిఖా చౌదరి పాత్ర లేదని తేల్చేసినా, ఇప్పుడు కేసు తెలంగాణకు బదిలీ కావడంతో శిఖా వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. జయరాం భార్య పద్మశ్రీ కూడా శికా చౌదరిపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు విచారణ మలుపు తిరిగింది.