కరెంటు షాక్ తో మూడేళ్ల బాలుడు మృతి..

700

అప్పటి వరకూ కళ్లముందే చలాకీగా తిరుగుతున్న పిల్లవాడు ఉన్నట్టుండి కరెంటు షాక్ తో గిలగిల కొట్టుకుని కుప్పకూలాడు. కళ్లముందే బిడ్డ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ దుర్ఘటన మనుబోలు కాగితాలపూరులో జరిగింది. మనుబోలుకి చెందిన మూడేళ్ల పార్థు కాగితాలపూరులో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అక్కడ ఆడుకుంటుండగా పొరపాటున విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్ కి గురయ్యాడు. అక్కడికక్కడే చనిపోయాడు.