తెలుగుదేశంలో మరో వికెట్ పడింది..

66

తెలుగుదేశంలో మరో వికెట్ పడింది..
పార్టీకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా..
తెలుగుదేశం పార్టీనుంచి ఎమ్మెల్యేల వలస కొనసాగుతోంది. మాజీ మంత్రి రావెల కిషోర్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరగా, ఆ తర్వాత మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. 2014లో నవోదయం పార్టీ తరపున గెలిచిన ఆమంచి, ఆ తర్వాత టీడీపీలో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తగిన గుర్తింపు లేదని పలువురు వద్ద వ్యాఖ్యానించడం దీనికి బలం చేకూర్చింది. పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ మారతారన్న ఊహాగానాలను నిజం చేస్తూ టీడీపీకి రాజీనామా చేశారు.