మరోసారి తాత అయిన చిరంజీవి..

90

క్రిస్మస్ పండగ రోజున చిరంజీవి కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. చిరు కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. కల్యాణ్‌దేవ్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ‘2018 క్రిస్మస్‌ నా జీవితాంతం గుర్తుండి పోతుంది. మాకు ఇవాళ ఉదయం ఆడశిశువు పుట్టింది. మీ అందరికీ సూపర్‌ మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’ అని ఆయన పోస్ట్‌ చేశారు.