నెల్లూరులో కాంట్రాక్ట్ మాఫియా..

66

నెల్లూరులో కాంట్రాక్టు మాఫియాను సృష్టించారని మంత్రి నారాయణపై సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. విద్య, వైద్య రంగాలను మాఫియాగా మార్చేసిన మంత్రి… ఇప్పుడు కమిషన్ల కోసం కాంట్రాక్ట్ మాఫియాను క్రియేట్ చేశారని ఆరోపించారు. 5వ డివిజన్ కిసాన్ నగర్లో పర్యటించిన అనిల్, రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోడ్డుపై రోడ్డు వేయడంతో కాలనీలలో వున్న ఇళ్ళన్నీ డౌన్ అయిపోయాయని, వర్షాకాలంలో ఇళ్ళలోకి నీరు వచ్చే అవకాశముందన్నారు. రోడ్లను పూర్తిగా తొలగించి, కొత్త రోడ్లు వేయాలని సూచించారు. ఈ విషయంలో మంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తూ, ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.