పేదలకోసం ఖర్చు చేయండి.. ndn news

48

మంత్రి నారాయణ తాను సంపాదించిన వేలకోట్ల రూపాయల్లో కొంచెం పేదలకోసం ఖర్చు చేయాలని సూచించారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. తన స్థాయిలో తాను రాజన్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పేదల కంటి సమస్యలకు ఉచిత వైద్యం అందిస్తున్నానని, నారాయణ తలచుకుంటే పేదలకు అన్నిరకాల ఆపరేషన్లు ఉచితంగా చేయించ వచ్చని అన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నెల్లూరు నగరంలోని 13వ డివిజన్లో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు.