చిప్పలేరు వాగు వంతెన ప్రారంభించిన సీఎం..

102

జువ్వలదిన్నె గ్రామంనుంచి చిప్పలేరు వాగు బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. చిప్పలేరు వాగుపై 25 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అక్కడినుంచి బైనాక్యులర్ ద్వారా చిప్పలేరు సముద్రంలో కలిసే ముఖద్వారాన్ని ఆయన పరిశీలించారు. చిప్పలేరువద్ద తీరప్రాంత మత్స్యకారులు పడవలద్వారా ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. పడవలకు టీడీపీ జండాలు కట్టారు. జాలర్లుకు సీఎం అభివాదం తెలిపి అక్కడినుంచి బయలుదేరారు.