సీఎం టూర్ కి భారీ బందోబస్తు..

98

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జువ్వలదిన్నె గ్రామంలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి అనంతరం జన్మభూమి సభలో పాల్గొంటారు చంద్రబాబు. చిప్పలేరు వాగుపై ఏర్పాటు చేసిన బ్రిడ్జిని సీఎం పరిశీలించే నేపథ్యంలో బ్రిడ్జి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్వయంగా ఈ బందోబస్తు ఏర్పాట్లు చూస్తున్నారు. చిప్పలేరు లో మత్స్యకారులు తమ పడవలకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.