అమరజీవి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం..

118

జువ్వలదిన్నె గ్రామంలో అమరజీవి పొట్టిశ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు సీఎం ని కలిసి తమసమస్యలు వివరించారు. అమరజీవి జన్మస్థలం జువ్వలదిన్నె గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇదే ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మత్య్సకారులను ఎస్టీలో చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని చెప్పారు సీఎం.