పురుగులమందు తాగి చావమంటారా..?

118

పురుగులమందు తాగి చావమంటారా..?
జన్మభూమి సభలో మహిళల ఆవేదన..
ఎయిర్ పోర్ట్ కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని బోగోలు జన్మభూమి సభలో ఆందోళన వ్యక్తం చేశారు మహిళలు. దామవరం కు చెందిన తాము 400ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నామని, పైరు ఏపుగా పెరిగిన దశలో అధికారులు కరెంటు కనెక్షన్ తీసేసి నీరు లేకుండా చేశారని వాపోయారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేకపోతే పురుగుల మందు తాగి చనిపోతామని అన్నారు.