ఒకేచోట, ఒకేరోజు, మూడు ప్రమాదాలు..

4114

కోవూరు సాయిబాబా గుడి సమీపంలో నేషనల్ హైవే. తెల్లవారు ఝామున రెండు లారీలు ఢీ కొన్నాయి. కొన్ని గంటలు గడవగానే అక్కడే అదే స్పాట్ లో మరో యాక్సిడెంట్. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి వస్తున్న శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు బైక్ ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తలపగిలి తీవ్ర గాయాలయ్యాయి. గంటలు గడిచాయి, అదే ప్లేస్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. ఈసారి ఇక్కడో కారు బోల్తా పడింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకేరోజు ఒకేచోట మూడు ప్రమాదాలు జరగడంతో స్థానికులు డేంజర్ జోన్ ను తలచుకుని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.