ఇతనికి ఎన్ని విగ్రహాలు పెట్టాలి..

211

మృత్యువు ఎదురొస్తే కొంతమంది ధైర్యంగా పోరాడగలరు. మృత్యువు ముంచుకొస్తే చావు తప్పదని తెలిసి ధైర్యంగా ఉండటం అతి కొద్దిమందికే సాధ్యం. అటువంటి సాహసికుడు మృత్యువులోనూ తల్లిప్రేమను, దేశభక్తిని మరువలేని నిజమైన మేరునగధీరుడు ఈ దూరదర్శన్ కెమెరామెన్ మొరుంకుట శర్మ. చత్తీస్ ఘడ్ దంతెవాడలో ఇటీవల నక్సల్స్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లతో సహా దూరదర్శన్ కు చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయిన సంగతి తెలిసిందే. మొరుంకుట శర్మ చనిపోతూ అనారోగ్యంగా ఉన్న తన తల్లికి ఆమెపై ప్రేమను ఆమెను జాగ్రత్తగా ఉండమంటూ వీడియోలో రికార్డ్ చేసి ప్రాణాలు వదిలాడు. ఇప్పుడు ఆ వీడియోలో మరికొన్ని దృశ్యాలను ఫొటోలుగా దూరదర్శన్ విడుదల చేసింది. తల్లికి జాగ్రత్తలు చెప్పిన తర్వాత దేశమాతకు సెల్యూట్ చేస్తూ అతడు తన తుదిశ్వాస విడిచాడు. ప్రేమ వ్యవహారాల్లో చనిపోయిన వాళ్లకు విగ్రహాలు పెట్టాలనేవాళ్లు, ఫ్యాక్షన్ తగాదాల్లో హత్యకు గురైనవాళ్లకు విగ్రహాలు పెట్టాలనేవాళ్లు, ఇలా రకరకాల వ్యక్తిగత కక్షలు, వ్యవహారాల్లో విగ్రహాలు పెట్టాలనేవాళ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. అయితే మొరుంకుట శర్మ చనిపోతూ తన జాతికి, దేశమాతకు చేసిన ఈ ఒక్క సెల్యూట్ చాలు, అతడి త్యాగ నిరతికి..