కళ్లెదుటే మృత్యువున్నా అమ్మపైనే ప్రేమంతా..

146

అప్పటికే తూటాలకు అతని ఒళ్లంతా ఛిద్రమైంది. మరోవైపు పోలీసులు, మావోయిస్ట్ ల మధ్య జరుగుతున్న కాల్పులతో ఆ ప్రాంతమంతా బుల్లెట్ల మోతతో దద్దరిల్లుతోంది. కానీ అతని మనసులో మాత్రం అమ్మ మాత్రమే ఉంది. విధి నిర్వహణలో భాగంగా చత్తీస్ గఢ్ దంతెవాడ ప్రాంతానికి వెళ్లి మావోయిస్ట్ ల దాడిలో మృత్యువాత పడిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ ఆఖరి సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. “అమ్మా ఐ లవ్యూ.. ఈ దాడిలో నేను చనిపోతాను. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు, చనిపోతున్నానని తెలిసినా నాకు భయం వేయడంలేదు”. అంటూ ఆ వీడియోలో ఆయన మాటలు రికార్డ్ అయ్యాయి. అమ్మకు కిడ్నీ సమస్య ఉంది. నాన్నకు ఏమీ తెలియదు. అమ్మా నువ్వు జాగ్రత్త.. అంటూ అమ్మ ఆరోగ్యంపై ఆయన పడిన తపన, ఆఖరి క్షణాల్లో కూడా అమ్మ గురించి అతని ఆవేదన ఆ వీడియో విన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాలకి తరిమేసే జాలిలేని కొడుకులున్న ఈ రోజుల్లో అచ్యుతానంద్ వంటి బిడ్డని కన్న ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో.