రోశమ్మ కుటుంబానికి బాలకృష్ణ ఆర్థిక సాయం

810

కలిగిరి, ఆగస్ట్-8: సారా వ్యతిరేక ఉద్యమ నేత దూబగుంట రోశమ్మ అంత్యక్రియలు ఆమె స్వగ్రామం కలిగిరి మండలం తూర్పు దూబగుంటలో ముగిశాయి. నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సహా పలువురు నేతలు ఆమెకు ఘన నివాళులర్పించారు. ఆమె స్ఫూర్తితోనే సారా ఉద్యమం ఊపిరిలూదుకుందని, మద్యపాన నిషేధానికి నాందిగా మారిందని గుర్తు చేసుకున్నారు. దూబగుంట రోశమ్మ కుటుంబానికి సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 వేల ఆర్ధిక సాయాన్ని నెల్లూరు నగర తెదేపా అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రోశమ్మ మృతికి సంతాపం ప్రకటించారు. ఫోన్‌ ద్వారా రోశమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.