సోనాలీకి శ్రద్ధాంజలి..

1995

క్యాన్సర్ తో బాధపడుతున్న సోనాలీ బెంద్రే చనిపోయినట్లు తెలిసిందని, ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామంటూ రామ్ కదమ్ అనే బీజేపీ నేత ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కలకలం రేపాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని..తనకు వచ్చిన సమాచారం తప్పని, సోనాలి త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ ఫేక్ న్యూస్ పై ఆమె భర్త గోల్డీ బెహెల్ స్పందించారు. తన భార్య సోనాలి బింద్రే గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘సామాజిక మాధ్యమాలను బాధ్యతతో వినియోగించండి. నా భార్య గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దని వేడుకుంటున్నాను. దీని వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
హైగ్రేడ్‌ మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు.