ఫతేఖాన్ పేట మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు

188

నెల్లూరులో ఫతేఖాన్ పేటలో ఈనెల 3వతేదీ జరిగిన మహేంద్రసింగ్ మర్డర్ కేసుని పోలీసులు ఛేదించారు. ప్రధాన ముద్దాయి విక్రమ్ సింగ్ ని అరెస్ట్ చేశారు. నిందితుడు విక్రమ్ సింగ్ హతుడు మహేంద్ర సింగ్ కి స్వయానా అన్న కొడుకు. గతంలో మహేంద్రసింగ్ కి చెందిన కోమల్ పవర్ టూల్స్ షాపు లో విక్రమ్ పనిచేశావాడు. అతని ప్రవర్తన నచ్చక ఇటీవల పక్కనపెట్టాడు మహేంద్ర సింగ్. వీటితోపాటు కుటుంబంలో కూడా కొన్ని తగాదాలున్నాయి. వీటన్నిటినీ మనసులో పెట్టుకుని విక్రమ్ సింగ్ కిరాయి హంతకులతో మహేంద్ర సింగ్ ని హత్యచేయించాడని చెప్పారు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి.