గూడూరులో దారుణం..

113

వేరే మతానికి చెందిన కుర్రాడిని ప్రేమిస్తోందని కన్న కూతురనే కనికరం లేకుండా ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తలపై తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో జరిగింది. స్థానికంగా నివాసం ఉండే సిద్ధయ్య కుమార్తె దేవయాని ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి జావీద్ ని దేవయాని ప్రేమించింది. ఆరేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి విషయం దేవయాని ఇంట్లో తెలిసింది. మొదట హెచ్చరించినా దేవయాని జావెద్ ని మరచిపోకపోవడంతో.. చివరకు కత్తితో ఆమెపై దాడిచేశాడు సిద్ధయ్య. కన్నకూతురని కూడా చూడకుండా విచక్షణారహితంగా నరకడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైంది దేవయాని.