నెల్లూరులో ఈనెల 8, 9 తేదీల్లో ఫెర్టి లైట్ సదస్సు..

122

సంతానం లేని దంపతులకు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యం, సంతాన సాఫల్యత చికిత్సలపై నెల్లూరులో ఈనెల 8, 9 తేదీల్లో జాతీయ సదస్సు జరుగుతుంది. ఈమేరకు జిల్లా గైనకాలజిస్ట్ అసోసియేషన్ తరపున వివరాలు తెలియజేశారు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర, డాక్టర్ అపూర్వ. ఇసార్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫెర్టి లైట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి దేశవ్యాప్తంగా ఉన్న గైనకాలజిస్ట్ లు, ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ లు హాజరవుతారని తెలియజేశారు.