ఖననం కోసం కలహం.. నడిరోడ్డుపై మృతదేహం..

156

చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో శ్మశానస్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమకు చెందిన పొలాల్లో శవాలను ఖననం చేయడం సరికాదంటూ ఓ వర్గం ఆందోళనకు దిగి అంతిమయాత్రను అడ్డుకుంది. తరతరాలుగా తాము అదే ప్రాంతాన్ని శ్మశానంగా వినియోగిస్తున్నామని మరో వర్గం శవాన్ని రోడ్డుపైనే ఉంచి ఆందోళనకు దిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. తహశీల్దార్ తో మాట్లాడి చివరకు హిందూ శ్మశాన వాటికలో ఖననం చేసేలా వారిని ఒప్పించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.