సినీ నటి దారుణ హత్య.. – ndn news

321

సినీ నటి దారుణ హత్య..
భర్తే హంతకుడు
చెన్నైలో ఘోరం జరిగింది. ఓ సినీనటిని, ఆమె భర్త, దర్శకుడు కూడా అయిన బాలకృష్ణన్ హత్యచేసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క గోనెసంచిలో కట్టి వివిధ ప్రదేశాల్లో పారేశాడు. తన భార్య కనిపించడంలేదని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాల్లో సహాయనటి సంధ్య సినీ దర్శకుడు బాలకృష్ణన్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు కొంతమందితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. దీంతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త అనేక సార్లు అక్రమ సంబంధాలు మానుకోవాలని చెప్పినా ఆమె వినలేదని చెబుతున్నారు. దీంతో ఇద్దరూ విడాకులకోసం కోర్టుకెక్కారు. ఈ దశలో మళ్లీ భార్యతో సయోధ్యకోసం దర్శకుడు బాలకృష్ణన్ ప్రయత్నం చేస్తే, తాను ప్రియుడితోనే ఉంటానని ఆమె తేల్చి చెప్పిందని అంటున్నారు. దీంతో జనవరి 19న ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అప్పటికే అన్నీ సిద్ధం చేసుకున్న బాలకృష్ణన్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు, ఆ తర్వాత శవాన్ని ముక్కలుగా నరికి నగరంలోని పలుచోట్ల పారేశాడు. చెన్నై శివారు పెరంగుడిలోని చెత్తకుప్పల్లో ఒక యువతికి చెందిన రెండు కాళ్లు ఒక చేయి గత నెల 21న పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి మృతురాలి ఆచూకీ కోసం అన్నిచోట్ల వెతికారు. సంధ్య అదృశ్యమైందన్న సమాచారంతో దర్యాప్తు జరిపి శరీర భాగాలు ఆమెవేనని గుర్తించి బాలకృష్ణన్ ను అరెస్ట్ చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.