బెంగళూరు ఎయిర్ షోలో భారీ అగ్నిప్రమాదం..

37

ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతున్న యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందకిపైగా కార్లు అగ్నికి ఆహుతైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పదికిపైగా అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ పార్కింగ్‌ స్థలానికి సమీపంలో కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది.