కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు, గగనతలంలో హై అలర్ట్..

25

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు, గగనతలంలో హై అలర్ట్..
విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్..
——————————
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు నగరాలకు వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. గగనతలంలో ఆంక్షలు కారణంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు. శంషాబాద్‌ నుంచి చండీగఢ్‌, అమృత్‌సర్‌, డెహ్రాడూన్‌, గురుగావ్‌ ప్రాంతాలకు వెళ్లే విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. ప్రయాణికులకు విమానాల రద్దు సమాచారాన్ని ముందుగానే తెలియజేసినట్టు అధికారులు పేర్కొన్నారు.