నిరుపేదలకు మెరుగైన వైద్యం..

113

నెల్లూరు రూరల్ పరిధిలో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అన్నిరకాల వైద్య సేవలు పేదలకు అందేలా, 30 మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని అన్నారు. అన్నిరకాల జబ్బులకూ, ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా చికిత్స చేయిస్తానని చెప్పారు. అవసరమైన వారందరికీ ఆపరేషన్లు కూడా చేస్తామని చెప్పారు. పేదల ఇంటివద్దకు వచ్చి కళ్లజోళ్లు ఇచ్చేలా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నానని వివరించారు. బీవీ నగర్లో ఉచితమెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆనం విజయ కుమార్ రెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి పాల్గొన్నారు.