ఒక్కరోజులో బంగారం రేటు ఎంత పెరిగిందో తెలుసా..?

311

వరుసగా నాలుగు రోజుల పతనం తర్వాత బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాల కారణంగా సోమవారం పసిడి ధర రూ.390 పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,850కి చేరుకుంది. స్థానిక నగల తయారీదారుల నుంచి భారీగా డిమాండ్‌ రావడంతో పసిడి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. బంగారం బాటలోనే వెండి పయనించింది.
రూ.800 పెరగడంతో కిలో వెండి ధర రూ.37,360కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో వెండి ధర కూడా పెరిగినట్లు వర్తకులు చెబుతున్నారు. గత నాలుగు సెషన్స్‌లో బంగారం ధర రూ.390 తగ్గింది. నేడు అంతే ధర పెరగడం గమనార్హం. అటు అంతర్జాతీయంగా పసిడి ధరకు రెక్కలొచ్చాయి. న్యూయార్క్‌ మార్కెట్‌లో ఔన్సు ధర 1,266.66 డాలర్లు పలికింది.