చేతగాని డాక్టరమ్మ గర్భాన్ని అడ్డదిడ్డంగా కోసేసింది

103

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. వైద్యులు చేసిన పాపానికి ఓ బాలింత చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గత నెల రెండవతేదీన రేవతి అనే మహిళకు గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పుకోసం ఆపరేషన్ చేసిన వైద్యులు, కడుపులో దూది పెట్టి కుట్లు వేశారు. 10 రోజుల తర్వాత రేవతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే గూడూరు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చేతులెత్తేయడంతో అక్కడినుంచి నెల్లూరుకు ఆ తర్వాత తిరుపతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా ఫలితం లేదు. బాలింత పరిస్థితి రోజు రోజుకీ విషమంగా మారింది. దీంతో బంధువులు ఆమెను తిరిగి గూడూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.