నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య..

3624

గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి సాయి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండురోజుల క్రితం ఆత్మహత్య జరిగినా ఎవరూ గమనించలేదు. శవం రెండు రోజులుగా ఫ్యాన్ కే వేలాడుతూ ఉంటడం దారుణం. పక్క రూమ్ నుంచి దుర్వాసన వస్తుందని తోటి విద్యార్థులు చెప్పడంతో హాస్టల్ నిర్వాహకులు ఈరోజు రూమ్ తెరిచి చూడటంతో ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. సిగరెట్ తాగుతున్నాడనే కారణంతో హాస్టల్ వార్డెన్ కాలేజీ హాస్టల్ నుంచి పంపించివేయడంతో.. సాయి బయటకు వచ్చి మరో హాస్టల్ లో ఉన్నాడు. ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు లక్ష్మీసాయి వయసు 21 సంవత్సరాలు. రాపూరు మండలం గుండవల్లి గ్రామం. గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ హాస్టల్ లో ఉంటున్నాడు. సాయి మరణంతో సహ విద్యార్థులు షాక్ కి గురయ్యారు.