బైక్ యాక్సిడెంట్ లో గాయపడ్డ హీరో గోపీచంద్

83

షూటింగ్ లో ప్రమాదం, ఆస్పత్రికి తరలింపు
—————————————
హీరో గోపీచంద్‌ సినిమా షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా అనిల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ సమీపంలోని మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సోమవారం అక్కడ చిత్రీకరణ ముగియనుంది. ఈ నేపథ్యంలో గోపీచంద్‌పై బైక్‌ ఛేజింగ్‌ పోరాట సన్నీవేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో అనుకోకుండా బైక్‌ స్కిడ్‌ అయింది. దీంతో స్వల‍్పంగా గాయపడ్డ అతడిని చిత్ర యూనిట్‌ సమీపంలోని ఫోర్టీస్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా గోపీచంద్‌ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదన‍్న వైద్యులు గాయాలకు చికిత్స తీసుకున్న తర్వాత చిత్రీకరణలో పాల్గొనవచ్చిన తెలిపారు.