శోభనంరోజే భర్త పారిపోయాడు …

2578

ఫస్ట్ నైట్ భర్త పరార్ …
ధర్నాకు దిగిన భార్య…
ప్రేమించి ఆపై పోలీసుల సమక్షంలో వివాహం చేసుకుని మొహం చాటేసిన భర్త కోసం భార్య పెదిరెడ్ల పరమేశ్వరి శుక్రవారం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పాతసంతబయలకు చెందిన పరమేశ్వరి, ఇదే ప్రాంతా నికి చెందిన షేక్‌ అబ్దుల్లా అలియాస్‌ వల్లీ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించటం లేని వల్లీ వెనకడుగు వేయడంతో పట్టణ సీఐ ని పరమేశ్వరి ఆశ్రయించింది. వల్లీని స్టేషన్‌కు పిలిపించి పో లీసులు పెళ్లికి ఒప్పించారు.
వారి సమక్షంలోనే ఇద్దరూ వివా హం చేసుకున్నారు. వల్లీ రాత్రి రాత్రే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పరమేశ్వరీ మళ్లీ టౌన్‌ సీఐను ఆశ్రయించింది. పోలీ సుల నుండి సరైన సమాధానం రావటం లేదని బాధితురాలు జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసింది. ఆరు నెలల నుంచి కాళ్లు అరిగేలా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం స్వయంగా వల్లీ ఇంటికి వెళ్లి తన భర్తను రప్పిం చాలంటూ డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగింది.