ప్రేమ, పెళ్లి.. చావు

1221

చిన్న చిన్న తగాదాలే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందనే కారణంతో భర్త ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. క్షణికా వేశంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం బుచ్చి మండలం పల్లప్రోలు గ్రామంలో జరిగింది. 28ఏళ్ల దర్శిగుంట హరి, మౌనిక ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హరికి తాగుడు అలవాటుంది, ఈ విషయంపై భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల గొడవలు పెరిగి పెద్దవై భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హరి ఒంటరిగా ఉంటున్నాడు. భార్యని బ్రతిమిలాడినా ఆమె తిరిగి రాకపోయే సరికి జీవితం మీద విరక్తితో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.