ఎనీ డౌట్స్..

132

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై నెల్లూరులోని మంత్రి నారాయణ కార్యాలయంలో ఈరోజు ఉదయం అధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆదాల మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ నుంచి తాను, ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బొల్లినేని కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉంటామని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం తాను, బొల్లినేని కృష్ణయ్యతో కలసి గత నెలరోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలను, పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నామని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని అన్నారు. సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశకు త్వరలో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు.