డబ్బుసంచులను నమ్మను..

59

డబ్బుసంచులను నమ్మను..
ప్రజల్నే నమ్ముకున్నా.. రూరల్ ఎమ్మెల్యే
డబ్బు సంచులను తానెప్పుడూ నమ్మలేదని, ఆ శక్తి కూడా తనకు లేదని, ప్రజల్నే నమ్ముకుని ప్రజాభిమానంతోనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రూరల్ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లిన ఆయన, అధికారం లేకున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల్నే నమ్ముకుని రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.