ఊరుదాటినా వెంటాడిన అక్రమ సంబంధం..

129

ఊరుదాటినా వెంటాడిన అక్రమ సంబంధం..
అక్రమ సంబంధం ఊరుదాటినా వెంటాడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డు శ్యామలకు అక్కడ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను నెల్లూరుకు తీసుకొచ్చేశాడు, రాజీవ్ గాంధీ నగర్ లో ఉంటూ ఇద్దరూ కూలి పనులకు వెళ్తున్నారు. అయినా రాజు అప్పుడప్పుడూ వచ్చి శ్యామలను వేధించేవాడు తనతోనే ఉండాలంటూ ఇబ్బంది పెడుతుండటంతో శ్యామల అందుకు ఒప్పుకోలేదు. ఈ రోజు ఉదయం 8గంటలకు ఇంటి దగ్గరకు వచ్చి తనతో వచ్చేయాలని ఒత్తిడి చేశాడు, ఆమె ఒప్పుకోకపోవడంతో రోకలిబండతో కొట్టి చంపేశాడు. ఆ సమయంలో భర్త కూడా లేకపోవడంతో రక్తగాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణం విడిచింది. శ్యామలకు ఇద్దరు పిల్లలున్నారు. నెల్లూరు క్రైమ్ బ్యాంచ్ డీఎస్పీ సుందరేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది.