పాక్ భూభాగంలో కూలిపోయిన భారత యుద్ధ విమానం..

39

పాక్ భూభాగంలో కూలిపోయిన భారత యుద్ధ విమానం..
పైలట్ గల్లంతు.. ధృవీకరించిన విదేశాంగ శాఖ..
—————————————–
పాకిస్థాన్‌లో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ యుద్ధవిమానం కూలినట్లు భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ ధ్రువీకరించారు. పైలట్‌ ఒకరు గల్లంతయ్యారని వివరించారు. భారత్‌ చేపట్టిన వాయుసేన దాడికి ప్రతిగా భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ ఈ ఉదయం దాడికి పాల్పడింది. పాక్‌ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. పాక్‌కు చెందిన ఎఫ్‌-16 విమానాన్ని కూల్చివేశామని, ఈ క్రమంలో మిగ్‌ 21 బైసన్‌ విమానం కూలిపోయిందని, కమాండర్‌ గల్లంతయ్యాడని విదేశాంగ ప్రతినిధి తెలిపారు. అతడు పాక్‌ అధీనంలో ఉన్నట్లు ఆ దేశం చెబుతోందని, వాస్తవాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని అడ్డుకొనే క్రమంలో శ్రీనగర్‌లో ఉన్న క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌లోని మిగ్‌లు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్‌ 21 బైసన్‌ పాక్‌ భూభాగంలోకి ప్రవేశించింది. ఆ విమానంలో ఉదయం వెళ్లిన పైలట్‌ అభినందన్‌ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇప్పటికే అభినందన్‌ తమకు చిక్కినట్లు పాకిస్థాన్‌ ఒక వీడియో కూడా విడుదల చేసింది.