కాపీకొడుతుండగా పట్టుకోవడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

580

కాపీకొడుతుండగా పట్టుకోవడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
హన్మకొండలోని నయీంనగర్‌లో గల ఆర్‌డీ కళాశాలలో పోలసాని రక్షరావు (16) అనే విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడుతుండగా.. కాలేజీ సిబ్బంది గుర్తించారు. ఆమెను ఎగ్జామ్ రాయకుండా అడ్డుకోవడంతో అవమానంతో అమ్మాయి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన రక్షను ఆస్పత్రికి తరలించారు.