జనఘోషకు దిగివచ్చిన అధికారులు..

65

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుపడితే ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేశాడు. రూరల్ పరిధిలో అధ్వాన్నపు రోడ్ల బాగు కోసం జనఘోష కార్యక్రమం ద్వారా పట్టు పట్టాడు. ప్రజలతో కలిసి పోరాటం చేశాడు. దీంతో అధికారులు దిగిరాక తప్పలేదు. ఏప్రిల్ 30 వతేదీనాటికి రోడ్లన్నిటికీ మరమ్మత్తులు పూర్తి చేస్తామని అధికారులు వ్రాతపూర్వక హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు టీం లను రప్పించి వెంటనే పనులు చేసేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ అలీంబాషాకు సూచించారు రూరల్ ఎమ్మెల్యే.