బస్సుప్రమాదం ఘటనకు మంత్రి నారాయణే బాధ్యుడు..

164

నెల్లూరు నగరంలో స్కూల్ బస్సు ప్రమాదంపై జనసేన నాయకులు స్పందించారు. అభివృద్ధి పేరుతో రోడ్లను అడ్డదిడ్డంగ తవ్వేసి, మరమ్మతులు చేయకుండా రోజుల తరబడి కాలయాపన చేయడం వల్లే ఈరోజు నెల్లూరులో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని ఆరోపించారు. మంత్రి నారాయణే ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆషిక్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు నెల్లూరు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేవలం పార్క్ లకు సోకులు చేసి ఉయ్యాలలు ఊగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోదని, నెల్లూరు నగరవాసుల కష్టాలను తెలుసుకోవాలంటే ఇప్పుడు వీధుల్లోకి రావాలని వారు కోరారు. ఇకనైనా నేతలు స్పందించాలని, ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలన్నారు.