జయలలితగా నిత్యామీనన్..

44

దివంగత జయలలిత జీవిత కథతో వస్తున్న సినిమా ‘ది ఐరన్‌ లేడీ’. ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత వర్థంతిని పురస్కరించుకుని చిత్రబృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో నిత్యామీనన్‌ జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. అచ్చం ఆమెలాగే కన్పిస్తున్నారు. పేపర్‌టేల్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క ‘మదరాస పట్టణం’ ఫేమ్‌ విజయ్‌ కూడా జయలలితపై బయోపిక్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు.
తమిళనాడు ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా ముద్ర వేసుకున్న జయలలిత రాజకీయ, సినీ జీవితాల్లోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నాయని చిత్రబృందం తెలిపింది. కన్నడలో ‘శ్రీశైల మహత్మ్యం’ అనే చిత్రం ద్వారా బాలనటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన జయ దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. 2016లో అనారోగ్యంతో జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.