జొన్నవాడలో మరో విషాదం..

181

జొన్నవాడలో మరో విషాదం..
పెన్నాలో మునిగి ఇద్దరు చిన్నారులు గల్లంతు..
జొన్నవాడ కామాక్షమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెన్నానదిలో దిగి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఒడ్డున ఆడుకుంటూ నదిలోకి దిగిన చరణ్(7), కవిత(15).. కనపడకుండాపోయారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. గజ ఈతగాళ్లు ఇద్దరు పిల్లలకోసం గాలిస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి నదిలో మునిగి చనిపోయాడు. వారం రోజులలోపే ఇద్దరు చిన్నారులు నదిలో గల్లంతయ్యారు.