ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదు, ఓట్లకోసం బడ్జెట్..

90

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అన్నదాతలు సుఖంగా ఉండరని, వర్షాలు లేక విశ్రాంతి తీసుకుంటుంటారని అన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. అన్నదాతా సుఖీభవ పేరుతో మరోసారి రైతుల్ని వంచించేందుకు బడ్జెట్ లో ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేవలం ఓట్లకోసమే తయారు చేశారని ఎద్దేవా చేశారు. అంకెల గారడీ తప్ప ఈ బడ్జెట్ తో ప్రయోజనం శూన్యం అని చెప్పిన కాకాణి, నెల్లూరు జిల్లా ప్రాజెక్ట్ లకు నామమాత్రంగా కేటాయింపులు చేశారని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాకే ఇలా మొండిచేయి చూపించడం దారుణం అని విమర్శించారు.