రైతుల్ని ముంచారు.. ఇక ఆక్వా రైతుల పని పడుతున్నారు..

171

రుణమాఫీ పేరుతో రైతుల్ని నిండా ముంచిన టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల తగ్గింపు పేరుతో ఆక్వా రైతుల్ని మోసగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని ధ్వజమెత్తారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. విద్యుత్ చార్జీలను నేరుగా తగ్గించకుండా రాయితీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామనడం దారుణం అని అన్నారు. వెంకటాచలం మండలం శ్రీరామాపురం గ్రామస్తులను వైసీపీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.