సోమిరెడ్డికి కాకాణి సవాల్

103

బండేపల్లి కాల్వ పనుల్లో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. మెగా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రా కంపెనీకి పనులు అప్పజెప్పేందుకు నిబంధనలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. కేవలం మెగా ఇంజినీరింగ్ కంపెనీకి పనులిస్తేనే మూడు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం ఆ కంపెనీకే టెండర్ దక్కేలా చూడటం కాక ఇంకేంటని ప్రశ్నించారు. ఇంజినీర్లతో కూడా తప్పుడు ప్రతిపాదనలు పంపిస్తున్నారని, వారికి కూడా అవినీతి మకిలి అంటేట్లు చేశారని అన్నారు. అక్రమాలను అడ్డుకోవడానికి తాము ప్రయత్నిస్తుంటే.. అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. టెండర్ వేయకుండా ఎవర్నీ అడ్డుకోలేదని, ఫోన్లు చేసి ఎవరికీ చెప్పలేదని కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అంటూ మంత్రి సోమిరెడ్డిని ప్రశ్నించారు కాకాణి.