సోమిరెడ్డిపై కాకాణి సెటైర్లు..

81

ఇచ్ఛాపురంలో జగన్ బహిరంగ సభ ముగియగానే నెల్లూరు సూపర్ మ్యాన్, సభ అట్టర్ ఫ్లాపైపోయిందంటూ నోరు పారేసుకున్నారని మంత్రి సోమిరెడ్డి పై మండిపడ్డారు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్ పై వ్యక్తిగత విమర్శలు, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడంలేదని విమర్శించిన సోమిరెడ్డిని ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారని అయినా ఆయన చట్టసభలకు రావడం ఏంటని ప్రశ్నించారు.