కావలిలో పట్టపగలే దారుణం

1016

మద్యం షాపు దగ్గర జరిగిన తగాదా ఓ వ్యక్తి ప్రాణాపాయంలోకి నెట్టింది. తగాదా జరిగిన తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయినా తిరిగొచ్చి మరీ ఇంట్లో నిద్రిస్తున్న కేశవులు (35) అనే వ్యక్తిని శ్రీనివాసులు అనే వ్యక్తి దారుణంగా నరికాడు. కావలి రూరల్ మండలం కొత్తపల్లిలో ఈ రోజు మిట్టమధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి గిలగిలా కొట్టుకున్నాడు కేశవులు. కొన ఊపిరితో ఉన్న అతడ్ని స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు.