కొత్త సంవత్సరాన కిడ్నీ బాధితుడికి కొత్త జీవితం

86

రూరల్ ఎమ్మెల్యే పిలుపుకి ఊహించని స్పందన
కొత్త సంవత్సరాన కిడ్నీ బాధితుడికి కొత్త జీవితం

నూతన సంవత్సరం తొలిరోజున.. ఓ కుర్రాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒక్క పిలుపుతో నెల్లూరుకు చెందిన 22ఏళ్ల కిడ్నీ బాధితుడు సుధాకర్ వైద్యానికి అయ్యే నిధుల్ని సమీకరించారు. అంచనాలకు మించి నిధులిచ్చిన మంచి మనసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్ కు వైద్యం చేయడానికి ముందుకొచ్చిన అపోలో ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఏ సమస్యలో అయినా వేలు పెట్టకూడదు, వేలు పెడితే సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేయకూడదు అదీ నా సిద్ధాంతం అంటూ చెప్పారు రూరల్ ఎమ్మెల్యే.