బాబు సమక్షంలో టీడీపీ తీర్థం..

189

కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెదేపాలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్న కిశోర్‌ చంద్రదేవ్‌.. ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2011 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో గిరిజన వ్యవహరాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.