కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యం..

83

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం తోనే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ సుమంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం లో పర్యటించిన ఆయన స్థానిక నాయకులతో సమావేశమై గ్రామంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. అనంతరం నాయకులతో కలిసి కనిగిరి రిజర్వాయర్ ను పరిశీలించారు. కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్-టీడీపీ పొత్తు పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ప్రధాన సమస్య లైన కనిగిరి రిజర్వాయర్ పూడిక తీత తో పాటు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కి పూర్వ వైభవం తీసుకు వస్తామని తెలిపారు.