తెలంగాణ ఎన్నికల్లో రెబల్స్ దే హవా అంటున్న లగడపాటి..

76

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ జోస్యం చెప్పారు. రెబెల్స్‌గా బరిలోకి దిగిన వీరు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు. తిరుమల వచ్చిన సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొందని చెప్పారు. తన సర్వే ఫలితాలను డిసెంబర్‌ 7న వెల్లడిస్తానని తెలిపారు. అంతకుముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు. తెలంగాణ ప్రజలు తొలిసారి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కానని చెప్పారు.