చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు..

915

నందమూరి వారసులపై ఓ రేంజ్ లో పైర్ అయ్యారు లక్ష్మీపార్వతి. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కి జరిగిన ద్రోహం, అన్యాయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు.. చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని విమర్శించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో అన్నీ నిజాలే చూపించాలని దర్శకుడు వర్మని కోరారు లక్ష్మీపార్వతి. తెలుగుదేశం పార్టీని స్థాపించి, దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఓ మహానుభావుడిని పార్టీనుంచి బహిష్కరిస్తున్నామని చెప్పిన ఓ దుర్మార్గుడి గురించి నిజాలు అందరికీ తెలియాలని అన్నారు. పార్టీ ఏమయినా వాళ్ల తాత సొమ్మా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కి జరిగిన ద్రోహం, అన్యాయంపై నిజాలు బయటకి వస్తాయని నమ్ముతూ సినిమాని ఆశీర్వదించాలని కోరుతున్నాని చెప్పారు లక్ష్మీపార్వతి.