లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వెన్నుపోటు తొలిపాట..

84

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పాట టైటిల్ తోనే అందరినీ ఆకర్షిస్తున్నాటు. వెన్నుపోటు అనే పాట ఫస్ట్ లుక్ ను శుక్రవారం సాయంత్రం ఆన్ లైన్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఇందులో చూపించబోతున్నామని వర్మ గతంలో ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు వర్మ. ఈ చిత్రానికి రాకేశ్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూడా తన తండ్రి జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ టైటిల్‌తో బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ కూడా 21నే విడుదల కాబోతోంది.