ఎన్ఠీఆర్ ను వదిలేసిన కుటుంబం, లక్ష్మీస్ ..లో పాట

241

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్. ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే తనదైన స్టైల్ సినిమాను ప్రమోట్ చేస్తున్న వర్మ తాజాగా రెండో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. తొలి పాటలో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతీల మధ్య ప్రేమాను రాగాలను చూపించిన వర్మ రెండో పాటలో ఎన్టీఆర్ పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించిందన్న విషయాలను టార్గెట్ చేశాడు.

 అవసరం అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ విజయాలు సాధించినప్పుడు ఆయన వెంట నడిచిన కుటుంబం, బంధువులు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఒంటరిని చేశారో ప్రస్తావించాడు. అయితే పాట మొత్తం సినిమాలోని పాత్రధారులను మాత్రమే చూపించిన చంద్రబాబు ను మాత్రం డైరెక్ట్‌గా చూపించాడు. వెన్నుపోటు పొడిచిన బాబు, ఎన్టీఆర్‌ పోయాక దండవేసి దండం పెడుతున్నాడని చురకలంటించాడు. కల్యాణ్ మాళిక్ సంగీత సారధ్యంలో విల్సన్‌ హెరాల్డ్ ఆలపించిన ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించారు. ఈ పాటతో పాటు రేపు (మార్చి 8) సినిమాకు సంబంధించి రెండో థియేట్రికల్‌ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు రామ్‌ గోపాల్‌ వర్మ.